రేపు ఎన్‌డీ పార్టీల విలీన సదస్సు
ఖమ్మం మామిళ్లగూడెం: ఒకే అజెండా, సిద్ధాంత రాజకీయంతో కొనసాగుతున్న రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీనం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు పోస్టర్లను గురువారం ఖమ్మంలో ఖమ్మంలో ఆవిష్కరించారు. అనంతరం ఎన్‌డీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు పార్టీల విలీనంతో దేశంలోనే బలమైన విప్లవ పార్టీగా అవతరించబోతుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా నుంచి సదస్సుకు భారీగా తలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈసమావేశంలో నాయకులు కోలా లక్ష్మీనారాయణ, వీ.వీ.రావు, మోహన్‌రావు, సుభాన్, సురేష్, జానకి, మురళి, పటేల్, షబ్బీర్, మస్తాన్, వెంకటేశ్వర్లు, బేతంపూడి నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment