సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థకు విజిలెన్స్ విభాగం వెన్నెముక వంటిదని సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ఈ విభాగం నేతృత్వాన ఉద్యోగులు, సంస్థ ఆస్తుల పరిరక్షణ, మెడికల్ బోర్డ్ పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. కొత్తగూడెంలోని సింగరేణి కార్యాలయంలో విజిలెన్స్ విభాగం అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థ ఆస్తుల పరిరక్షణతో పాటు అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. మెడికల్ బోర్డ్‌లో అన్‌ఫిట్ చేయిస్తామని డబ్బు వసూలు చేసే వారిని కట్టడి చేయాలని సూచించారు.
పలు అంశాలకు ఆమోదం
కొత్తగూడెంలోని సింగరేణి కార్యాలయంలో శుక్రవారం 103వ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎండీ బలరామ్, డైరెక్టర్ సత్యనారాయణరావుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వార్షిక లెక్కలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు చర్చించిన పలు అంశాలను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment