●కాంగ్రెస్ హవా..
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది ఎదురు లేకపోగా గతంతో పోలిస్తే పట్టు పెరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి తమదైన ముద్ర ఉండేలా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఖమ్మం నుంచి పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలో విస్తరించిన మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలిచారు. అలాగే, ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు, రేణుకాచౌదరికి రాజ్యసభ సీటు దక్కింది. అంతేకాక బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు పలువురు కాంగ్రెస్‌లో చేరడంతో కేఎంసీలో ఆ పార్టీకి బలం పెరిగినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment