హోరాహోరీగా పోరు!
సత్తా చాటిన
ఖమ్మం బాలుర జట్టు
రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీకి పాత పది జిల్లాల వారీగా బాలబాలికల జట్లు హాజరయ్యాయి. మొత్తంగా 240మంది క్రీడాకారులతో పాటు కోచ్‌లు, మేనేజర్లు 60మంది హాజ రయ్యారు. తొలిరోజైన శుక్రవారం బాలుర లీగ్ పోటీల్లో పూల్ ‘ఏ’ విభాగం నుంచి ఖమ్మం – మెదక్ జట్లు తలపడగా వరుసగా మూడు సెట్లలో 25–17, 25–20, 25–19 పాయింట్లు సాధించిన ఖమ్మం జట్టు విజయదుంధుబి మోగించింది. రెండో మ్యాచ్ వరంగల్–నల్లగొండ జట్ల మధ్య జరగగా 3–0 తేడాతో వరంగల్ నెగ్గింది. ఇక పూల్ ‘బీ’లో మహబూబ్‌నగర్ – హైదరాబాద్ జట్ల నడు మ మ్యాచ్ జరగగా 3–0 స్కోర్‌తో మహబూబ్‌నగర్, రంగారెడ్డి – కరీంనగర్ మధ్య మ్యాచ్‌లో 3–0 తేడాతో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. బాలికల విభాగానికొచ్చే సరికి నిజామాబాద్ – ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 3–0 తేడాతో నిజామాబాద్ గెలవగా, నల్లగొండ–రంగారెడ్డి జట్లు తలపడిన మ్యాచ్‌లో నల్లగొండ జట్టు వరుసగా మూడు సెట్లు గెలిచి విజేతగా నిలి చింది. ఆతర్వాత వరంగల్– మెదక్ జట్ల మ్యాచ్ ఐదు సెట్లలో జరగగా 3–2 తేడాతో వరంగల్ విజయం సాధించింది. ఇక మహబూబ్‌నగర్–కరీంనగర్ జట్లు తలబడిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 3–0 తేడాతో గెలుపు దక్కించుకుంది.
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి సీఎం కప్ బాలబాలికల వాలీబాల్ పోటీలు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేసినప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతితో సాదాసీదాగా మొదలుపెట్టారు. పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, డీఈఓ సోమశేఖరశర్మ ప్రారంభించగా, తొలుత మన్మోహన్‌సింగ్ మృతికి సంతాపంగా క్రీడాకారులు మౌనం పాటించడంతో పాటు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, రాత్రివేళ కూడా పోటీలు నిర్వహించేలా కోర్టుల వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్య, స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌లు ఎం. డీ.గౌస్, ఎం.డీ.అక్బర్‌అలీ, పాఠశాలల క్రీడా సంఘం జిల్లా కార్యదర్శి కె.నర్సింహమూర్తి, క్రీడా సంఘాల ప్రతినిధులు ఎం.డీ.షఫీక్ అహ్మద్, ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పటేల్ స్టేడియంలో సీఎం కప్
రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ
పాత పది జిల్లాల నుంచి హాజరైన
240 మంది క్రీడాకారులు
ఫ్లడ్ లైట్ల వెలుతురులో
మ్యాచ్‌ల నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment