ఈ ఏడాది ముఖ్య ఘటనల్లో కొన్ని..
●ఫిబ్రవరి 14 : బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
●ఫిబ్రవరి 16 : డీసీసీబీ అధ్యక్షుడిగా నాగభూషణం స్థానంలో దొండపాటి వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు.
●మార్చి 2 : సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, 16 రాష్ట్రాల్లో ఉన్న పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) ఆర్‌ఐ పార్టీలు విలీనమై సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్‌గా అవతరించగా విలీన సభ ఖమ్మంలో నిర్వహించారు.
●ఏప్రిల్ 19 : బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ హాజరయ్యారు.
●ఏప్రిల్ 29 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
●మే 13 : లోక్‌సభ ఎన్నికలు
●మే 27 : ఎమ్మెల్సీ ఎన్నికలు
●జూన్ 4 : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడగా ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు.
●జూన్ 8 : ఉమ్మడి జిల్లాకు చెందిన పొదెం వీరయ్య, మువ్వా విజయ్‌బాబు, రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, నూతి శ్రీకాంత్ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల్లో నియమితులయ్యారు.
●నవంబర్ 27 : సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందారు.
●డిసెంబర్ 18 : సత్తుపల్లిలో జరిగిన సీపీఎం 22వ జిల్లా మహాసభలకు పొలిట్‌బ్యూరో సభ్యుడు బీ.వీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు.
●డిసెంబర్ 26 : సీపీఐ శత వార్షిక ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీ, సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment