ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల వినూత్న నిరసన
ఖమ్మంసహకారనగర్: సర్వీస్ క్రమబద్ధీకరణతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు శుక్రవారం వినూత్న నిరసన తెలిపా రు. కలెక్టరేట్ సమీపంలోని దీక్ష శిబిరం వద్ద బజ్జీలు వేసి అమ్మారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు అనిల్, కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. అతి తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందన్నారు. అనంతరం దీక్ష శిబిరంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇస్మాయిల్, రాణి, భగవాన్, శివకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment