కురుక్షేత్రలో తల్లాడ మహిళల గీతాపారాయణం
తల్లాడ: మూడు రోజులుగా హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్రలో జరిగిన భగవద్గీత పారాయణంలో ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుర్రం మాలిని, సంకా కళ్యాణి, జవ్వాజి నీలిమ పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన వటవృక్షం కురుక్షేత్రలో ఉంటుందని భావిస్తారు. ఈ మేరకు 24 నుంచి 26వ తేదీ వరకు అక్కడ భగవద్గీత పారాయ ణం ఏర్పాటు చేయగా తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజ రయ్యారు. ఇందులో తల్లాడ నుంచి ముగ్గురికి అవకా శం దక్కగా పారాయణం అనంతరం వారిని శ్రీగణ పతి సచ్చిదానంద మైసూర్ స్వామిజీ అభినందించి జ్ఞాపికలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment