విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
డీఐఈఓ రవిబాబు
చింతకాని : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డీఐఈఓ రవిబాబు అన్నారు. మండలంలోని నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వార్షిక పరీక్షలకు సన్నద్ధం అవుతున్న క్రమంలో ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు. విద్యార్థి దశలో ఇంటర్ చాలా కీలకమని, రానున్న వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి కళాశాలకు, మండలానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. హెల్ప్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ కరుణాకర్ విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నవీన్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కృష్ణార్జునరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
సుడా సీపీఓగా రాజ్‌కుమార్
ఖమ్మంమయూరిసెంటర్ : స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఎం.రాజ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్‌గా, సీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న రాజ్‌కుమార్‌ను సుడా సీపీఓగా బదిలీ చేశారు. దీంతో పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ సిటీ ప్లానర్ (డీసీపీ) బాధ్యతలు కూడా అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
డీఈఓ సోమశేఖర శర్మ
కల్లూరు: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు సాధించాలని డీఈఓ సోమశేఖర శర్మ ఉపాధ్యాయులను కోరారు. కల్లూరులోని బాలికోన్నత పాఠశాలను, మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవా రం ఆయన పరిశీలించారు. 6,7,8 తరగతులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నడుస్తుండగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులంతా 10/10 జీపీఏ గ్రేడ్‌లు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పొదిలి పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా క్రిస్టియన్ మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందిస్తున్నారని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ తెలిపారు. కుట్టు మిషన్ల కోసం ఈనెల 20 వరకు ఆన్‌లైన్‌లో tgobmms. cgg. gov. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ చేశాక సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment