రక్తదానంతో ప్రాణాలు రక్షించొచ్చు
ఖమ్మంమయూరిసెంటర్ : ప్రమాద సమయంలో అవసరమైన వారికి రక్తదానం చేస్తే వారి ప్రాణాలు కాపాడొచ్చని, రక్తదాతలు ప్రాణదాతలని ఆర్టీసీ ఖమ్మం ఆర్‌ఎం ఎ.సరిరామ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఖమ్మం డిపో ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌లో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఆర్‌ఎం మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున క్షతగాత్రులకు రక్తం అత్యవసరమని, సమయానికి దొరకకుంటే ప్రాణాపాయం తప్పదని అన్నారు. ప్రతీ ఒక్కరు రక్తదానం చేయడం అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం పవిత్ర, పర్సనల్ ఆఫీసర్, డిపో మేనేజర్ దినేష్‌కుమార్, సీఐ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఆర్‌ఎం సరిరామ్
Comments
Please login to add a commentAdd a comment