ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం
డీపీఓ ఆశాలత
నేలకొండపల్లి : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని డీపీఓ పి.ఆశాలత అన్నారు. మండలం లోని బోదులబండ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. మంచినీటి కుళాయిలు, టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. సరిపడా సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయని, పేపర్ల ముద్రణ టెండరింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. ఇంటి పన్నుల వసూళ్లలో జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 40 శాతం మాత్రమే పూర్తయిందని, ఫిబ్రవరి నాటికి నూరు శాతం వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ సీహెచ్.శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment