20 అడుగులకు చేరిన ‘పాలేరు’
కూసుమంచి : పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం బుధవారానికి 20.03 అడుగులకు చేరింది. రిజర్వాయర్‌కు సాగర్ నుంచి 5,068 క్యూసెక్కుల నీరు చేరుతుండగా ఎడమ కాలువ ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు 4,069 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పాలేరు కాలువకు 150 క్యూసెక్కులతో పాటు భక్తరామదాసు ప్రాజెక్టుకు మరో 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల నిమిత్తం 135 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్‌కు సాగర్ నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈనెల 11 నుంచి ఆరు రోజుల పాటు ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేయనుండగా, 23 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment