రేపటి నుంచి జేఈఈ మెయిన్స్
ఖమ్మం సహకారనగర్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యాన నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ మొదటి విడత పరీక్షలు ఈనెల 22వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారు 6వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఈనెల 22, 23, 24, 28, 29, 30వ తేదీల్లో రెండేసి సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9నుంచి 12గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు నిర్వహించనుండగా విద్యార్థులను గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డుల్లో ఒకటి లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, పెన్ను, అడ్మిట్‌కార్డు, వాటర్ బాటిల్, బీఆర్ పరీక్షౖకైతే పెన్సిల్, స్కేల్, రబ్బర్, జామెంట్రీ బాక్స్ వెంట తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది.
సమయపాలన తప్పనిసరి
జేఈఈ మెయిన్స్, బీఆర్క్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులు సాధారణ దుస్తులు ధరించడంతో పాటు షూ కాకుండా చెప్పులతో హాజరుకావాలి. హాల్‌టికెట్‌లో సూచించినట్లు సమయపాలన, ఇతర నిబంధనలు పాటించాలి. పరీక్ష అనంతరం రఫ్ బుక్‌లెట్‌ను డ్రాప్‌బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది.
– పార్వతీరెడ్డి, పరీక్షల జిల్లా కోఆర్డినేటర్
జిల్లాలో ఐదు కేంద్రాలు,
6వేల మంది విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment