ఉల్లాసంగా... ఉత్సాహంగా
రెండో రోజుకు చేరిన పోలీసుల క్రీడాపోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: నిత్యం పనిఒత్తిడితో సతమతమయ్యే పోలీసులకు ఉపశమనం కలిగించేలా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు సోమవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పురుషులు, మహిళలకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ తదితర పోటీలు నిర్వహించగా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రికెట్ పోటీలను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ప్రారంభించడమే కాక బౌలింగ్, బ్యా టింగ్‌లోనూ సత్తా చాటారు. కాగా, రెండో రోజు పురుషుల షాట్‌ఫుట్‌లో ఎస్.కే.మజీద్(కల్లూరు), ఎస్.కే.ఉద్దండు(ఏఆర్, ఖమ్మం), ఎ.వెంకటేశ్వర్లు(వైరా), 800 మీ టర్ల పరుగులో వినోద్, గణేష్(ఏఆర్, ఖమ్మం), కేశవ్(కూసుమంచి), డిస్కస్ త్రోలో ఎస్.కే.మజీద్(కల్లూరు), నాగరాజు, మహేష్(ఏఆర్, ఖమ్మం), మహిళల షాట్‌ఫుట్‌లో ఎం.మౌనిక(ఆర్‌ఎస్సై, ఖమ్మం), వి.శ్రావణిఽ(ఏఆర్, ఖమ్మం), ఎన్.స్వప్న(హోంగార్డ్) మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు. అలాగే, డిస్కస్ త్రోలో బి.లక్ష్మీకుమారి(వైరా), ఎం.మౌనిక, ఆర్.సునీత(ఏఆర్, ఖమ్మం, బి.మాధవి(వైరా), 100 మీటర్ల పరుగులో ఎల్.భవాని, ఉషారాణి, హరిత(ఖమ్మం) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, మంగళవారం పోటీలు ముగియనుండగా విజేతలకు బహుమతులు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment