అవకాశాలను వినియోగించుకుంటే ఫలితం
ఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థినులు అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సెంటినరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన ఆన్‌లైన్ ద్వారా ఐఐటీ, జేఈఈ పరీక్షలకు అందిస్తున్న శిక్షణను పరిశీలించి కళాశాలలో మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి నేలపైనే కూర్చుని మాట్లాడారు. ఆడపిల్లలకు గతంలో చదువుకునే అవకాశం ఉండేది కాదని, ఇప్పుడు అన్నీ సమకూరుతున్నందున జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని, ఆపై మరో పది మందికి చేయూతనివ్వాలని తెలిపారు. కాగా, టాయిలెట్లు, కిచెన్‌రూమ్ సమస్యలను ప్రిన్సిపాల్ రాజలక్ష్మి వివరించగా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతీ బ్యాచ్‌కు గుర్తుగా కిచెన్ గార్డెన్‌లో మొక్కలు నాటించాలని సూచించారు. ఆతర్వాత కలెక్టర్ మజమ్మల్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్టలు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment