ఓవరాల్ చాంప్.. సిటీ ఏఆర్ జట్టు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోలీసు క్రీడాపోటీలు మంగళవారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ జట్టు దక్కించుకోగా, వ్యక్తిగత చాంపియన్లుగా ిఏఆర్ కానిస్టేబుల్ బి.గణేష్, సివిల్ కానిస్టేబుల్ ఎల్.భవానీ దక్కించుకున్నారు. కాగా, ముగింపు సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పాల్గొని బహమతులు అందజేశారు. ఈసందర్భంగా టగ్ ఆఫ్ వార్ ఫైనల్స్‌లో వైరా – ఖమ్మం రూరల్ డివిజన్లు పోటీపడగా ఖమ్మం రూరల్ జట్టు విజయం సాధించింది. ఈసందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నేరస్తులు కొత్తపంధా ఎంచుకుంటున్న నేపథ్యాన నేరాలను అరికట్టడం, కేసుల పరిశోధన పోలీసులకు సవాల్‌గా మారుతోందని తెలిపారు. ఈ నేపథ్యాన సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు శారీరక, మానసిక దృఢత్వం అవసరమని చెప్పారు. ఈమేరకు ఒత్తిడి తగ్గించేందుకు క్రీడాపోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అడిషనల్ డీసీపీలు నరేష్‌కుమార్, ప్రసాద్‌రావు, కుమారస్వామి, విజయబాబు, ట్రెయినీ ఐపీఎస్ రుత్విక్‌సాయి, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రెహమాన్, సాంబరాజు, ఫణీందర్, రవి, వెంకటేశ్, నర్సయ్య, సుశీల్ సింగ్ పాల్గొన్నారు.
వ్యక్తిగత చాంపియన్లుగా గణేష్, భవాని
ముగిసిన పోలీసు క్రీడాపోటీలు
Comments
Please login to add a commentAdd a comment