పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
ఖమ్మంఅర్బన్/ఖమ్మం రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. ఖమ్మం 6వ డివి జన్, ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడులో మంగళవారం జరిగిన సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జాబితాల్లో అనర్హులు ఉంటే పరిశీలించి తొలగిస్తామన్నారు. ఇదే సమయాన ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డుల కోసం అర్హులకు చోటు కల్పిస్తామని, దరఖాస్తులు తెలిపారు. ఈ సభల్లో అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, అధికారులు జి.జ్యోతి, నర్సింహారావు, పి.రాంప్రసాద్, శ్రీదేవి, కార్పొరేటర్ నాగండ్ల కోటి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ
ఖమ్మం సహకారనగర్: సంక్షేమ పథకాలకు లబ్ధిదా రుల ఎంపిక నిరంతరం కొనసాగుతుందనే అంశాన్ని ప్రజలకు వివరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. పలువురు మంత్రులు, సీఎస్ శాంతికుమారితో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అభ్యంతరాలను పరిశీలించి అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో 250 సభలు నిర్వహించగా దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment