ఖమ్మంక్రైం: జనం అత్యాశే ఆయుధంగా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతారని ఖమ్మం సైబర్ క్రైం డీఎస్పీ ఫణీందర్ వెల్లడించారు. ఈనేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విలాసవంతమైన వస్తువులు బహుమతిగా ఇస్తామని, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపిస్తామనే మాయమాటలు నమ్మొద్దని డీఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. నిత్యం వాడే సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారితో అప్రమత్తంగా ఉండాలని, మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే ట్రోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేయాలని సూచించారు.
చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో జైలుశిక్ష
ఖమ్మం లీగల్: అప్పు తీర్చే సమయంలో ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో వ్యక్తికి జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఎకై ్సజ్ కోర్టు న్యాయాధికారి శాంతిలత మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మంకు చెందిన ఏ.మోహన్‌రావు 2012 ఆగస్టులో వశీకరణ బాలరాజు వద్ద రూ.3లక్షల అప్పు తీసుకున్నాడు. ఆతర్వాత 2017లో అప్పు తీర్చే క్రమాన చెక్కు జారీ చేశారు. అయితే, చెక్కును బ్యాంకులో జమచేస్తే మోహన్‌రావు ఖాతాలో సరిపడా నగదు లేక నిరాదరణకు గురైంది. ఈమేరకు బాలరాజు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణలో నేరం రుజువు కావడంతో మోహన్‌రావుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
12మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
తల్లాడ: తల్లాడ మండలంలోని అన్నారుగూడెంలో మంగళవారం పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, ఎస్‌ఐ బి.కొండల్‌రావు ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టగా అన్నారుగూడెం మొక్క పోచమ్మ ఆలయం గుట్టల సమీపాన పేకాట ఆడుతూ ఆరుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.65 వేలు నగదు, ఆరు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే, తల్లాడలోని ఓ ఇంట్లో తనిఖీ చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 12,660 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment