యూరియా ఇవ్వడం లేదని ఆందోళన
బోనకల్: బోనకల్ మండలం రావినూతల సొసైటీ పరిధిలో రైతులకు యూరియా ఇవ్వడం లేదని ఆళ్లపాడుకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళనకు డైరెక్టర్లు కూడా మద్దతు తెలిపారు. సొసైటీ పరిధిలో రావినూతల, ఆళ్లపాడు గ్రామాలు ఉండగా రావినూతల రైతులకే యూరియా ఇచ్చి తమకు ఇవ్వడం లేదని ఆళ్లపాడు రైతులు వాపోయారు. సొసైటీ చైర్మన్, సీఈఓ ఏకపక్ష వైఖరితో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈమేరకు సీఈఓ రాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ గ్రామానికి ఎంత యూరియా ఇచ్చారో రికార్డులు చూపించాలని పట్టుబట్టారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరావుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కాగా, సొసైటీ చైర్మన్ మైనేని నారాయణ, సీఈఓ రాంబాబు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆళ్లపాడుకు చెందిన డైరెక్టర్లు తోటకూర వెంకటేశ్వరావు, చెన్నకేశ పెద్దవెంకయ్య, వెంకట్రాములు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మందా రామారావు, బుంగా నరేష్, షేక్ పెంట్‌సాహెబ్, ధనమూర్తి, పారా వెంకటమోహన్, ప్రసాద్, మల్లాది లింగయ్యత పాల్గొన్నారు.
రైతులకు మద్దతుగా
రాజీనామా చేసిన డైరెక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment