ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి..
ఖమ్మం సహకారనగర్/రఘునాథపాలెం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూటీఎఫ్ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు షేక్ రజాక్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేజీబీవీ, యూఆర్‌ఎస్, ఆశ్రమ పాఠశాలల కాంట్రా క్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం వేతనం ఇవ్వడమే కాక పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించా లని, జూలై 2023 నుండి పీఆర్సీ అమలు చేయాలన్నారు. అలాగే, రిటైర్మెంట్ వయసు పెంచాలనే ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవానితో పాటు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, వెంకన్న, రాంబాబు, ఎల్లయ్య, రవికుమార్, నరసింహారావు, సురేష్ పాల్గొన్నారు. కాగా, రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులంలో నూతన సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ గురుకులాల్లో ఉపాధ్యాయులకు పని ఒత్తిడి ఉండడమే కాక మిగతా వారితో పోలిస్తే ఎక్కువ పనిగంటలు ఉండడంతో అనా రోగ్యం బారిన పడుతున్నందున హెల్త్ కార్డ్‌లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వర్, లివింగ్‌స్టన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment