డైమండ్ జూబ్లీ జంబోరీకి శ్రీనివాస్
ఖమ్మంస్పోర్ట్స్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పడి 75ఏళ్లు పూర్తయిన ఈనెల 28నుండి ఫిబ్రవరి 3 వరకు తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలో డైమండ్ జూబ్లీ జంబోరీ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాలని ఖమ్మంకు చెందిన శ్రీనివాస్‌కు ఆహ్వానం అందింది. వారం పాటు జరిగే జంబోరీ ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా 40 వేల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటారు. ప్రస్తుతం నేలకొండపల్లి నాచేపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ 25 ఏళ్లలో ఎందరో కేడెట్లకు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం తెలంగాణ ట్రైనింగ్ టీంలో అసిస్టెంట్ లీడర్ పనిచేస్తున్నారు.
108 వాహనం పరిశీలన
పెనుబల్లి: పెనుబల్లిలోని 108 వాహనాన్ని జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. వాహనంలో పరికరాల పనితీరు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఫోన్ రాగానే త్వరగా ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులు, అనారోగ్య బాధితులను ఆస్పత్రులకు చేర్చాలని సూచించారు. ఈఎంటీ బి.రమేష్, పైలట్ జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment