సందు దొరికితే సర్దేసుడే..
అనుకూలంగా మలుచుకుని...
మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 2019 కంటే పూర్వం గజాల్లో రిజిస్ట్రేషన్ చేసిన భూములను మాత్రమే విడగొట్టి క్రయవిక్రయాలు జరుపుకునేలా 257 జీఓ తీసుకొచ్చింది. లేఔట్ లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగొద్దనే భావనతో జారీ చేసిన ఈ జీఓకు తూట్లు పొడిచి అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సమాచారం. దీన్ని సబ్ రిజిస్ట్రార్లు ఆదాయ వనరుగా మార్చుకుని భూమి ఏదైనా సరే విడగొట్టి రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.లక్షల్లో వసూలుచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరికొందరు వ్యవసాయ భూమిని సైతం అక్రమంగా నాలా రిజిస్ట్రేషన్ల ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
ఏకంగా రోడ్డునే తగ్గించి వేసి..
సత్తుపల్లి బైపాస్‌రోడ్డులోని సర్వే నంబర్ 106/ఏ/1లో భూమి ఇద్దరు వ్యక్తుల మధ్య పహాణీతో రిజిస్ట్రేషన్ అయింది. గతేడాది డిసెంబర్‌లో ఇదే డాక్యుమెంట్‌ను 300 గజాల చొప్పున విడగొట్టి ఆరుగురి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అయితే పాత డాక్యుమెంట్‌లో రిజిస్ట్రేషన్ చేసిన సమయాన ఉన్న 40 అడుగులుగా రోడ్డును రెండో దఫాలో 30 అడుగులకు తగ్గించడం గమనార్హం. ఈ సమయాన రూ.లక్షల్లో చేతులు మారినట్లు సమాచారం. మూడెకరాల స్థలంలో పది అడుగుల వెడల్పు రోడ్డు తగ్గించడంతో భూయజమానులకు ఎంత మేలు జరిగింది, అధికారులకు ఎంత ముట్టచెప్పారో అర్థం చేసుకోవచ్చు.
సెలవుపై సబ్ రిజిస్ట్రార్..
కేవలం మూడు నెలల వ్యవధిలోనే పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణల నేపథ్యాన ఉన్నతాధికారుల సూచనలతో సత్తుపల్లి సబ్‌రిజిస్ట్రార్ సెలవులో వెళ్లినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ల కంటే ఈ అధికారి మరిన్ని అక్రమాలకు పాల్ప డ్డాడనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారని చెబుతూ విచారణ చేపట్టకుండా, చర్యలు తీసుకోకుండా సెలవుపై పంపించడం గమనా ర్హం. అయితే, సత్తుపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఏ అధికారి వచ్చినా ఒకరిద్దరు డాక్యుమెంట్ రైటర్లు అధికార పార్టీ పేరు చెప్పి మచ్చిక చేసుకోవడం లేదంటే బెదిరించి మరీ పనులు చేయించుకుంటున్నారనే విమర్శలున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడంలో సబ్‌రిజిస్ట్రార్ పాత్ర స్థాయిలోనే డాక్యుమెంట్ రైటర్ల పాత్ర కూడా ఉంటోందనే చర్చ జరుగుతోంది.
257 జీఓ ఆధారంగా అక్రమ రిజిస్ట్రేషన్లు
సత్తుపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు, ఉద్యోగుల చేతివాటం
విమర్శలు వెల్లువెత్తడంతో సెలవులో వెళ్లిన అధికారి, మరొకరికి ఇన్‌చార్జ్
సబ్ రిజిస్ట్రార్లు తలుచుకుంటే బస్టాండ్ అయినా.. చార్మినార్ అయినా రిజిస్ట్రేషన్ చేస్తారనేది ఓ నానుడి. అందుకు తగినట్టుగానే ఇటీవల వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలా కన్వర్షన్ లేని భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఘటన మరువక ముందే సత్తుపల్లి కార్యాలయంలో మరో అక్రమం వెలుగుచూసింది. ఇక్కడి సబ్ రిజిస్ట్రార్
కార్యాలయంలో కొందరు అధికారులు, సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
–సత్తుపల్లి
విచారణ జరిపిస్తాం
సత్తుపల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలు ఉల్లంఘించిన జరిగిన లావాదేవీలపై ఫిర్యాదులు అందాయి. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపిస్తాం. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ సెలవులో వెళ్లడంతో ఇన్‌చార్జ్ బాధ్యతలు మరో ఉద్యోగికి అప్పగించాం.
– రవీందర్, జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment