జైలు ఆవరణలో భద్రత భేష్
ఖమ్మంరూరల్: జిల్లా జైలు ఆవరణలో భద్రత పటిష్టంగా ఉండడమే కాక ఆవరణను పచ్చదనంతో తీర్చిదిద్దడం అభినందనీయమని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటలోని జిల్లా జైలులో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆవరణలో పరిశీలించిన సీపీ మాట్లాడుతూ ఖైదీల్లో అక్షరాస్యత పెంచేందుకు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని కొనసాగించాలని సూచించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడిన సీపీ శిక్షాకాలం పూర్తయ్యాక సత్ప్రవర్తనతో మెలగాలని తెలిపారు. ఏఆర్ ఏసీపీ సుశీల్‌కుమార్ సింగ్, జైలు సూపరింటెండెంట్ శ్రీధర్, జిల్లా సబ్ జైళ్ల అధికారి జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment