‘కాంగ్రెస్‌వి అవకాశవాద రాజకీయాలు’
ఖమ్మం మామిళ్లగూడెం: కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన ఖమ్మంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపై కానీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై కానీ సరైన గౌరవం లేదన్నారు. అంబేడ్కర్ భౌతికకాయానికి ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండా ఎవరు అడ్డుకున్నారు, స్మారక చిహ్నం నిర్మాణాన్ని ఎవరు కాదన్నారో ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజలంతా గమనించి ప్రధాని మోదీ పాలనకు మద్దతు తెలపాలని కోరారు. ఈసమావేశంలో నాయకులు సన్నె ఉదయప్రతాప్, గెంటేల విద్యాసాగర్, ఈ.వీ.రమేష్, శ్యాంరాథోడ్, నున్న రవికుమార్, డాక్టర్ శీలం పాపారావు, మందా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment