శాశ్వత నిత్యాన్నదానానికి రూ.6లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

శాశ్వత నిత్యాన్నదానానికి రూ.6లక్షల విరాళం

Published Fri, Jan 24 2025 12:19 AM | Last Updated on Fri, Jan 24 2025 12:19 AM

శాశ్వత నిత్యాన్నదానానికి రూ.6లక్షల విరాళం

శాశ్వత నిత్యాన్నదానానికి రూ.6లక్షల విరాళం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి గురువారం పలువురు భక్తులు విరాళం అందచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ మాధవనగర్‌కు చెందిన వింజమూరి భాస్కర్‌రావు – ధనలక్ష్మి దంపతులు రూ.5,00,004 విరాళం చెక్కును అధికారులకు అందజేశారు. అలాగే, ఖమ్మం గొల్లగూడెం వాసి ఎన్‌సీహెచ్‌.కృష్ణమాచార్యులు–రమాదేవి దంపతులు రూ.1,00,116ను ఆలయ ఈఓ రమాదేవికి అందజేశాక స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, అర్చకులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement