జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య

Published Mon, Nov 18 2024 2:22 AM | Last Updated on Mon, Nov 18 2024 2:22 AM

జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య

జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య

మంచిర్యాలక్రైం: జీవితంపై విరక్తితో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వినిత తెలిపారు. ఆమె కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన అనుదీప్‌(30) ప్రైవేటు డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గతంలో ఓ యువతితో ప్రేమ వ్యవహారంలో గొడవలు జరుగగా, రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో స్వల్పగాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎవరూ పెళ్లి చేసుకోరని మద్యానికి బానిసై ఏమి పనిచేయకుండా తిరుగుతుండేవాడు. శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లో ఉరేసుకున్నాడు. తల్లి ఉమ తెల్లారి చూసేసరికి చీరతో దూలానికి అనుదీప్‌ ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. తల్లి ఉమ ఫిర్యాదుతో ఆదివారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పురుగుల మందు తాగి వ్యక్తి..

తాంసి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై ముంతాజ్‌ తెలిపారు. ఏఎస్సై కథనం ప్రకారం.. భీంపూర్‌ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన కుడ్మేత రాంచందర్‌ (35) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం వరుసకు సోదరుడైన వ్యక్తి ఇంటికి అతని లేని సమయంలో వెళ్లాడు. దీంతో వరుసకు సోదరుడు మందలించడంతో రాంచందర్‌ అవమానంగా భావించాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాత్రి వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆదివారం మధ్యాహ్నం గుబిడిపల్లి శివారులో పురుగులమందు తాగి విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై ముంతాజ్‌ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement