ఉట్నూర్, నార్నూర్ ప్రాంతంలో పులి సంచారంతో మండలంలోని జామ్‌డా, తాడిహత్నూర్, గుంజాల, నాగల్‌కొండ, పట్నాపూర్, మహగావ్, చోర్గావ్ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎఫ్‌ఎస్‌వో సుదర్శన్ జాదవ్ తెలిపిన వివరాలు.. ఆదివారం ఉట్నూర్ మండలంలోని నాగాపూర్ వద్ద వాకింగ్ చేస్తున్న కొందరు యువకులకు పులి కనిపించడంతో వారు భయంతో పురుగులు తీశారు. హస్నాపూర్, శంకర్‌నాయక్ తండా మీదుగా మధ్యాహ్నం నార్నూర్ మండలం జామ్‌డా శివారులో పశువులు మేత మేస్తుండగా పులి ఆవుపై దాడి చేసింది. కాపరి కేకలతో అక్కడి నుంచి వెళ్లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. నార్నూర్ మండలం జామ్‌డా, తాడిహత్నూర్, నాగల్‌కొండ, చోర్గావ్, బాబేఝరి, సుంగాపూర్, మహగావ్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండురోజులపాటు ప్రజలు పత్తి ఏరేందుకు గాని ఇతర వ్యవసాయ పనులకు వెళ్లొద్దని సూచించారు. సోలార్ జట్కా మిషన్, కరెంట్ తీగలను ఎవరూ పెట్టవద్దన్నారు. జామ్‌డా నుంచి కుమురం భీం జిల్లా జైనూర్ మండలం మీదుగా కెరమెరి మండలం జోడేఘాట్ అటవీ ప్రాంతానికి పులి వెళ్లిపోతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment