తిర్యాణి: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం జిల్లాలోని దాదా పు 12 మండలాల్లో పది డిగ్రీల సెల్సియస్‌లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్(యూ)లో అత్యల్పంగా 6.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తిర్యాణిలో 7.2, కెరమెరిలో 7.3, వాంకిడిలో 7.5, ధనోరాలో 7.8, కాగజ్‌నగర్‌లో 8.4, రెబ్బెనలో 9.1, చింతలమానెపల్లి, సిర్పూర్(టి)లో 9.2, బెజ్జూర్, జైనూర్‌లో 9.4, దహెగాంలో 9.6, ఆసిఫాబాద్‌లో 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు ఈదురుగాలులకు వణుకుతున్నారు. రానున్న మూడు రోజులపాటు చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నేడు పంచాయతీ కార్మికుల ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ కార్మి కులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర జేఏసీ పిలుపు మేర కు మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు జీపీ కా ర్మికుల యూనియన్ నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయంలో సోమవారం ధర్నా నోటీసు అందించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెర్క శ్రీకాంత్ మాట్లాడుతూ జీవో నంబర్ 51 సవరించాలని, మల్టీపర్పస్ కార్మిక విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయ తీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రి టైర్మెంట్ బెన్ఫిట్ కింద రూ.5లక్షలు చెల్లించా లని, ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్, నగేశ్ తదితరులు ఉన్నారు.
18న యూటీఎఫ్ మహాసభ
ఆసిఫాబాద్‌రూరల్: కాగజ్‌నగర్ పట్టణంలో ఈ నెల 18న టీఎస్ యూటీఎఫ్ ఐదో మహా సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందురావు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి, కార్యదర్శి శ్రీధర్ హాజరవుతారని తెలిపారు. జిల్లా, మండల కమిటీ సభ్యులు తరలిరావా లని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు హేమంత్, రమేశ్, గణేష్, సత్యనారాయణ, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 16, 18, 20 విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్, పదో తరగతి మార్కుల మెమో తీసుకురావాలన్నారు. వివరాలకు 80080 90626 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment