డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నేరవేర్చే వరకు సమ్మె ఆపేదిలేదని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక అన్నారు. కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె ఆదివారం ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 ఏళ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నామన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులందరిని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, రూ.10 లక్షల జీవిత బీమా, ఆరోగ్యబీమా సౌ కర్యం, పదవీ విరమణ బెనిఫిట్స్, 12 నెలల వేతన స్కేల్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ, యూఆర్‌ఎస్ సమగ్ర శిక్షా సిబ్బంది తుకారాం, మోహన్, గాగేష్, సంతోష్, రాజేశ్, ప్రశాంత్, మల్లేశ్, రమాదేవి, ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment