మొదటి రోజే.. నో మెనూ
కేతిని ఆశ్రమ పాఠశాలలో వండిన పప్పు
చింతలమానెపల్లి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వసతి గృహాలలో కామన్ డైట్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది. కానీ రెండవ రోజే ఆదివారం మండలంలోని కేతిని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు మెనూ ప్రదర్శించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నీళ్ల చారు, ఆకుగోబి కూర అందించారు. ఈ విషయంపై సిబ్బందిని ప్రశ్నించగా శనివారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు, అధికారులకు సమావేశం ఉండడంతో భోజనంలో చికెన్ అందించామని, దీంతో ఆదివారం కూరగాయ, పప్పు భోజనంలో అందించామన్నారు. శనివారం కోడిగుడ్ల కూర పెట్టాల్సి ఉండగా ఆదివారం సైతం అందించలేదు. సరైన భోజనం అందించడంలో క్షేత్రస్థాయిలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment