జీవనం.. దుర్భరం
అక్కడే ఉపాధి.. నిద్ర
● జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ● సాయంత్రం నుంచే శీతల గాలులు ● గజగజ వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు ● గూడులేక బస్టాండ్లలో తలదాచుకుంటున్న అభాగ్యులు ● రాత్రిపూట కార్మికులు, ఉద్యోగులు, చిరువ్యాపారులకు తప్పని అవస్థలు
మంగళవారం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు(సెల్సియస్‌లో)
ఆసిఫాబాద్‌అర్బన్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోదరులు రాకేశ్, సంజయ్ ఆసిఫాబాద్ పట్టణ సమీపంలోని గుండి రహదారిపై స్వెటర్లు, దుప్పట్లు అమ్ముకునేందుకు ఓ డేరా వేసుకున్నారు. ఏటా వీరు సీజన్‌లో వ్యాపారం ముగిసిన తర్వాత స్వరాష్ట్రానికి వెళ్లిపోతారు. పొద్దంతా స్వెటర్లు అమ్ముకుంటూ గడిపే వారు రాత్రిపూట అదే డేరాలో నిద్రపోతున్నారు. చలికి ఇబ్బందులు ఎదురవుతున్నా వ్యాపారం కోసం తప్పదని చెబుతున్నారు.
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు శీతాకాలంలో కశ్మీర్‌ను తలపిస్తాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి.. ఉదయం 10 గంటలు దాటినా తగ్గని చలిగాలులు ఇక్కడ సర్వసాధారణం. మూడు రోజులుగా చలితీవ్రత పెరగడంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ఇల్లు దాటి బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు బతుకు బండిని లాగేందుకు ఎముకలు కొరికే చలిలో పనిచేస్తున్నారు. జీవనోపాధి కోసం ఇబ్బందులనూ లెక్కచేయడం లేదు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలు ప్రాంతాలను ‘సాక్షి’ బృందం విజిట్ చేసింది.
కెరమెరి 7.1 డిగ్రీలు
తిర్యాణి 7.4
ధనోరా 8.3
గిన్నెధరి 9.2
బెజ్జూర్ 9.3
సిర్పూర్(యూ) 9.6
కాగజ్‌నగర్ 9.7
సిర్పూర్(టి) 9.7
వాంకిడి 9.8
డబ్బులు పోయాయి.. చలిలో ఉన్నాం
మాది మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామం. షిర్డీకి వెళ్లేందుకు ఆసిఫాబాద్ బస్టాండ్‌కు వచ్చాం. డబ్బులు పోవడంతో రాత్రి ఇక్కడే బస్టాండ్‌లో నిద్రపోతున్నాం. దుప్పట్లు సరిపోకపోవడంతో చలికి ఇబ్బంది పడ్డాం. అత్యవసర పరిస్థితుల్లో బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం సౌకర్యాలు కల్పించాలి.
– స్వప్న, నెన్నెల, మంచిర్యాల జిల్లా
రాత్రి షెల్టర్లు నిర్మించాలి
మాది నిజామాబాద్ జిల్లా. అక్కడ సొంతవారు ఎవ్వరూ లేకపోవడంతో ఆసిఫాబాద్‌లో ఓ వ్యక్తి ఇంట్లో పని చేస్తున్నా. పగలంతా పనిచేసి అక్కడే భోజనం చేస్తా. రాత్రిపూట తిన్న తర్వాత పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో పడుకుంటున్నా. ప్రభుత్వం రాత్రిషెల్టర్లు నిర్మించి వసతి కల్పించాలి.
– చింతగింజల లక్ష్మి, నిజామాబాద్ జిల్లా
కార్మికుల
గజ గజ
● నైట్ షిఫ్ట్‌ల్లో తగ్గుతున్న హాజరు
రెబ్బెన: ఎముకలు కొరికే చలిలో సింగరేణి కార్మికులు రాత్రి విధులకు హాజరవుతున్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే బెల్లంపల్లి ఏరియాలో గనులు ఉన్న ప్రాంతం భిన్నంగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు విస్తరించి ఉండటంతో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతుంటాయి. నైట్ షిఫ్ట్‌లో పర్మినెంట్ ఉద్యోగులు, ఓబీ కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది మొత్తం 400 మంది వరకు పనిచేస్తుంటారు. యాజమాన్యం గోలేటి ఎక్స్‌రోడ్ నుంచి కై రిగూడ ఓసీపీ వరకు బస్సు సౌకర్యం కల్పించింది. కార్మికులు, ఎస్‌అండ్‌పీసీ, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది చలి కి గజగజ వణుకుతూ విధులకు హాజరవుతున్నా రు. బైక్‌లపై వచ్చేవారు స్వెట్టర్లు, చేతులకు గ్లౌ జులు, షూలు ధరిస్తున్నారు. ఫస్ట్ షిప్టులో కాస్త పర్వాలేదనిపించినా సెకండ్ షిప్టు, నైట్ షిప్టుల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కొంతమందికి మాత్రమే స్వెట్టర్లు పంపిణీ చేయడంతో మిగిలినవారు సొంతంగా కొనుక్కున్నారు. పని ప్రదేశాల్లో కనీసం టీ కూడా అందుబాటులో ఉండదు. చలిని తట్టుకోలేక నైట్‌షిప్టులో కార్మికుల హాజరు శాతం తక్కువగా నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment