‘మధ్యాహ్న’ కార్మికుల వంటావార్పు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల విషయం అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. కోడిగుడ్ల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, వేతనాలు కూడా ఒకేసారి చెల్లించాలన్నారు. ఇతర సమస్యలు పరిష్కరించాల ని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద, కార్యదర్శి మాయ, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment