రేపు మినీ జాబ్‌మేళా
ఆసిఫాబాద్‌అర్బన్: జన్కాపూర్‌లోని తెలంగా ణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కేంద్రంలో ఈ నెల 19న ఉదయం 11 గంటలకు మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. మెడ్‌ప్లస్(కరీంనగర్) సంస్థలో హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని ప్రాంతాల్లో పనిచేసేందుకు 40 ఫార్మసిస్ట్ పోస్టులకు బీ, డీ ఫార్మసీ అర్హత ఉండాలన్నారు. 50 కస్టమర్ సపోర్టు అసోసియేట్, 100 జూనియర్ అసిస్టెంట్, 30 అడిట్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివి, వయస్సు 18 నుంచి 30 వరకు ఉండాలని పేర్కొన్నారు. వివరాలకు 94405 14962, 95027 86438, 91606 08476 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నేటి నుంచి జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాల్లో సీఎం కప్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెల 7 నుంచి 12 వరకు గ్రామ, మండల స్థాయిల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 18 నుంచి 21 వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్‌వో మీనారెడ్డి తెలిపారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన మండలం గోలేటిలో ఈ పోటీలు కొనసాగనున్నాయి. జిల్లాస్థాయి పోటీలకు 15 మండల నుంచి 3,000 మంది ఎంపికయ్యారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు.
పోటీలు ఇలా..
ఈ నెల 18న జిల్లా కేంద్రంలో గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్ అండర్– 14, 18, 20లో రన్నింగ్, ఖోఖో, చెస్, వాలీబాల్, యోగా పోటీలు నిర్వహిస్తారు. ఫుట్‌బాల్ పోటీలు గిరిజన బాలికల పాఠశాలలో జరుగుతాయి. 19న జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో అత్యపత్య, హ్యాండ్‌బాల్, కబడ్డీ(పురుషులు), ఖోఖో అండర్ 17, 19 పోటీలు, తెలంగాణ మోడల్ స్కూల్‌లో అండర్– 18 నెట్‌బాల్ పోటీలు, కాగజ్‌నగర్‌లో బాక్సింగ్ జూనియర్ అండర్– 14, 16, 18, 20, సబ్ జూనియర్ అండర్– 14 పోటీలు నిర్వహిస్తారు. 20న గోలేటిలోని సింగరేణి స్కూల్‌లో బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, సెపక్ తక్రా అండర్– 15, 19 పోటీలు, జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో కబడ్డీ, ఖోఖో (మహిళలు) పోటీలు, సిర్పూర్(టి)లో కిక్ బాక్సింగ్ సబ్ జూనియర్ పోటీలు, జిల్లా కేంద్రంలోని బాలికల ఆదర్శ క్రీడాపాఠశాలలో సైక్లింగ్, జూడో, లాడ్ టెన్నీస్, షాట్‌ఫుట్, సాఫ్ట్‌బాల్, షూటింగ్ బాల్, అర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ జూనియర్, సబ్ జూనియర్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment