ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి
● సింగరేణి సీఎండీ ఎన్.బలరాం ● శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో పర్యటన
శ్రీరాంపూర్/మందమర్రిరూరల్: నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు తప్పనిసరిగా సాధించాలని సింగరేని సీఎండీ ఎన్.బలరామ్ నాయక్ సూచించారు. శ్రీరాంపూర్ ఓసీపీని, మందమర్రి ఏరియాలోని కేకే–ఓసీపీని ఆదివారం సందర్శించారు. ఏరియాల జీఎంలు సూర్యనారాయణ, దేవేందర్, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు అధికారులు టి.శ్రీనివాస్, మల్లయ్య సీఎండీకి స్వాగతం పలికారు. వ్యూపాయింట్ నుంచి పని ప్రదేశాలను చూపెట్టారు. ఉత్పత్తి వివరాలను వెల్ల డించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తితోపాటు ఓబీ లక్ష్యాలను కూడా సాఽ దించాలన్నారు. ఈ సంవత్సరం శ్రీరాంపూర్ ఓసీపీ 32 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సి ఉందన్నారు. 330 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కూడా వెలికితీయాలని తెలిపారు. రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధించినప్పుడే సింగరేణి అభివృద్ధి చెందుతుందన్నారు. రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఉత్పత్తి అయిన బొగ్గును సకాలంలో రవాణా చేయడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. దీనికోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని తెలిపారు. అనంతరం గని ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఓసీపీ మేనేజర్ బ్రహ్మాజీ, రక్షణ అధికారి శ్రీనివాస్, సర్వే అధికారి సంపత్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏరియా ఆస్పత్రి సందర్శన..
రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా పరిధి లోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిని సీఎండీ బలరాంనాయక్ ఆదివా రం సందర్శించారు. పలు వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో మందమర్రి జీఎం దేవేందర్, శ్రీరాంపూర్ జీఎం సూర్యనారాయణ, ఏరియా ఎస్‌వోటూ జీఎం విజయ్‌ప్రసాద్, వైద్యాధికారులు, యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment