ప్రతిరోజూ భోజనం రుచి చూడాలి
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజూ ఉపాధ్యాయులు రుచి చూడాలని జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ అ న్నారు. మండలంలోని ఇందాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. దొ డ్డు బియ్యం సరఫరా కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, ప్రతీ వారం మూడు గుడ్లు అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చే శారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయురాలు సరోజ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment