మంచిర్యాల జిల్లా భీమిని మండలం కర్జిభీంపూర్‌కు చెందిన రైతు అభిలాష్‌కు అదే పరిస్థితి ఎదురైంది. అతను మంచిర్యాల జిల్లాలో సీసీఐ కొనుగోళ్లు నిలిపేయడంతో ఆసిఫాబాద్‌కు పంట తీసుకువచ్చాడు. ఇక్కడ అధికారులు కొనుగోలుకు తొలుత అంగీకరించి తర్వాత నిరాకరించారు. పత్తిని విక్రయించడానికి అతను సైతం మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో పడిగాపులు కాస్తున్నట్లు తెలిసింది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధ మహిళా రైతు పేరు కురెంగ దుర్గాబాయ్. ఎల్లా రం గ్రామానికి చెందిన ఈమె మూడు రోజుల కిందట 64 క్వింటాళ్ల పత్తిని తీసుకుని ఆసిఫా బాద్ జిల్లా కేంద్రంలోని ఓ జిన్నింగ్ మిల్లుకు వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఆమె పంట ను పరిశీలించిన సీసీఐ అధికారులు రూ.7,421 ప్రకారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యా రు. సగం సరుకు దించగా మళ్లీ సీసీఐ అధికారులు వచ్చి పత్తి నాసిరకంగా ఉందంటూ కొనుగోలును తిరస్కరించారు. ఇదే అదనుగా జిన్నింగ్ మిల్లు యజమాని అదే పత్తిని తాను రూ.6000కు కొంటానని, లేదంటే ఇంటికి తీసుకెళ్లాలని ఖరాకండిగా చెప్పడంతో వృద్ధ మహిళా రైతుకు పాలుపోక ఆందోళనకు గురైంది.
Comments
Please login to add a commentAdd a comment