● జిల్లాలో సీసీఐ అధికారుల ఇష్టారాజ్యం ● ధర నిర్ణయించాక నాసిరకం పేరిట తిరస్కరణ ● ఇదే అదనుగా ధర తగ్గిస్తున్న జిన్నింగ్‌ మిల్లుల యజమానులు ● ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో పత్తి రైతుల ఆందోళన ● అమాంతం ధర తగ్గిస్తే తీవ్ర నష్టమంటున్న కర్షకులు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో సీసీఐ అధికారుల ఇష్టారాజ్యం ● ధర నిర్ణయించాక నాసిరకం పేరిట తిరస్కరణ ● ఇదే అదనుగా ధర తగ్గిస్తున్న జిన్నింగ్‌ మిల్లుల యజమానులు ● ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో పత్తి రైతుల ఆందోళన ● అమాంతం ధర తగ్గిస్తే తీవ్ర నష్టమంటున్న కర్షకులు

Published Thu, Jan 9 2025 12:52 AM | Last Updated on Thu, Jan 9 2025 12:53 AM

● జిల

● జిల్లాలో సీసీఐ అధికారుల ఇష్టారాజ్యం ● ధర నిర్ణయించాక

రైతులను నష్టపోనియ్యం

జిల్లా కేంద్రంలోని ఓ జిన్నింగ్‌ మిల్లులో ప లువురు రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన పత్తి నాసిరకంగా ఉందంటూ సీసీఐ అధికా రులు తిరస్కరించిన విషయం నా దృష్టికి వ చ్చింది. అయితే వారికి నష్టం వాటిళ్లకుండా మరో జిన్నింగ్‌ మిల్లులో ఆయా రైతుల పత్తి ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.

– అశ్వక్‌ అహ్మద్‌, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో పత్తి కొనుగోళ్ల మాయలో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడు. పండిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు వస్తున్న వారు గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నాడు. భారత పత్తి సంస్థ(సీసీఐ) చేస్తున్న కొనుగోళ్ల వ్యవహారం ఇందుకు కారణమవుతోంది. తొలుత ప్రభుత్వ గిట్టుబాటు ధరకు పత్తి కొనుగోలుకు అంగీకరించిన సీసీఐ అధికారులు తర్వాత నాసిరకం పేరిట దానిని తిరస్కరిస్తున్నారు. దీంతో అన్నదాతలు తెచ్చిన పత్తిని తక్కువ ధరకు వ్యాపారులు అడుగుతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ జిన్నింగ్‌ మిల్లు యజమాని క్వింటా పత్తిపై రూ.1400లకుపైగా తగ్గించి అడగడంతో పత్తి రైతులు మిల్లు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వ్యాపారుల దోపిపీ పర్వం వెలుగులోకి వచ్చింది.

తొలుత అంగీకారం.. తర్వాత తిరస్కారం

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్‌ ఎక్స్‌రోడ్డ వద్ద ఉన్న ఓ జిన్నింగ్‌లో పత్తిని విక్రయించడానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగునే ఉన్న మంచిర్యాల జిల్లా నుంచి రైతులు వస్తుంటారు. బుధవారం ఉదయం నుంచి పత్తి సరుకు వాహనాలతో క్యూలో ఉన్న రైతుల వద్దకు వచ్చిన సీసీఐ అధికారులు పత్తిని పరిశీలించారు. తేమ శా తం పరీక్షించిన అనంతరం పత్తిని కొనుగోలు చేయడానికి అంగీకరించారు. మహిళా రైతు దుర్గాబాయ్‌, మరో రైతు అభిలాష్‌ తాము తీసుకొచ్చిన సరుకులో సగభాగానికి పైగా పత్తిని ఆ జిన్నింగ్‌ మిల్లులో దించేశారు. మిగిలిన మొత్తాన్ని దించుతుండగా అక్కడికి చేరుకున్న సీసీఐ అధికారులు ఆయా రైతుల పత్తి నాసిరకంగా ఉందంటూ కొనుగోళ్లను తిరస్కరిస్తున్నట్లు గేట్‌ ఎంట్రీ పాస్‌లో రాసివ్వడంతో అక్కడ ఉన్న రైతులందరూ ఆందోళనకు దిగారు.

జిన్నింగ్‌ యజమాని మాయ

సీసీఐ అధికారులు తిరస్కరించిన పత్తిని మరోచోట విక్రయించే పరిస్థితి దాదాపు ఉండదు. ఇదే అవకా శంగా భావించిన స్థానిక జిన్నింగ్‌ మిల్లు యాజ మాని రైతుల వద్దకు వచ్చి క్వింటాకు రూ.6వేల ధర తాను చెల్లిస్తానంటూ బేరమాడగా.. రైతులు తీవ్ర ని రసన వ్యక్తం చేశారు. పైగా మిల్లు వద్ద కాంటా సై తం సరిగా లేదంటూ ఆందోళన చేపట్టి.. కాంటాను పలుమార్లు పరీక్షించడం కనిపించింది. తొలుత కాంటాలో తప్పుడు రీడింగ్‌ ఉన్నట్లు గ్రహించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మిల్లులో పనిచేసే సి బ్బంది తర్వాత దానిని సరిచేయడం గమనార్హం.

దుర్గాబాయ్‌ పత్తిని రిజెక్ట్‌ చేసినట్లు గేట్‌ అవుట్‌పాస్‌లో సంతకం చేసిన సీసీఐ అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
● జిల్లాలో సీసీఐ అధికారుల ఇష్టారాజ్యం ● ధర నిర్ణయించాక 1
1/1

● జిల్లాలో సీసీఐ అధికారుల ఇష్టారాజ్యం ● ధర నిర్ణయించాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement