న్యాయ నిర్ణేతలుగా గోలేటివాసులు
రెబ్బెన(ఆసిఫాబాద్): హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న 34వ సీని యర్ జాతీయస్థాయి సెపక్తక్రా టోర్నమెంట్‌కు న్యాయ నిర్ణేతలుగా రెబ్బెన మండలంలోని గోలేటివాసులు ఎంపికైనట్లు సెపక్తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. నేషనల్ టోర్నమెంట్ కమిటీ మెంబర్లుగా గోలేటికి చెందిన సీనియర్ క్రీడాకారుడు కుమ్మరి మల్లేశ్, సింగరేణి ఉన్నత పాఠశాల పీఈటీ కె.భాస్కర్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. జాతీయస్థాయి పోటీల రెఫ రీలుగా ఎంపికైన వారిని ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, సెపక్తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, మల్లేష్, బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment