పాఠశాలల్లో వసతుల కల్పనకు చర్యలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. మండలంలోని నంబాల జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. తరగతి గదులతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలు, రిజిస్టర్లు పరిశీలించారు. వి ద్యార్థులకు అందుబాటులో ఉన్న తాగునీరు, మూ త్రశాలల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదనపు బోరు మంజూరు చేయాలని గ్రామీణ నీటి స రాఫరా శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించా రు. ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా నూతన మెనూ ప్రకారం పోషకాహారం అందించాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులు గైర్హాజరు కాకుండా ఉపాధ్యాయులు కృషి చే యాలన్నారు. అనంతరం నంబాలలో సోలార్ ప్లాంటు ఏర్పాటుకు భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఏపీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌రూరల్: పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌక్‌లో ఎన్‌ఎస్ క్లీన్ అండ్ గ్రీన్ సేవా సంతన్ స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. ఈ నెల 26లోగా పనులు పూ ర్తి చేయాలన్నారు. అనంతరం నజ్రూల్‌నగర్ సోలా ర్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment