పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
ఆసిఫాబాద్‌అర్బన్: పోలీసు కుటుంబాలకు కష్టకాలంలో అండగా ఉంటామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన ఏఎస్సై మక్సుద్ అహ్మద్ కుటుంబ సభ్యులకు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో రూ.8,60,000 విలువైన చెక్కు అందించా రు. బాధిత కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఇతర బెనిఫిట్స్ వేగంగా అందేవిధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ పెద్దయ్య, ఏవో శ్రీనివాస్, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయ శంకర్‌రెడ్డి, సిబ్బంది వర్మ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన ఇన్‌చార్జి డీఎస్పీ
డీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్ ఇన్‌చార్జి డీఎస్పీగా బా ధ్యతలు స్వీకరించిన కరుణాకర్ బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో జిల్లాలోనే డీఎస్పీగా విధులు నిర్వర్తించిన కరుణాకర్‌ను ఇటీవల డీజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మళ్లీ డీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్ ఇన్‌చార్జి డీఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment