ఆర్థిక సాధికారతతోనే మహిళల ఎదుగుదల
ఆసిఫాబాద్: ఆర్థిక సాధికారతతోనే మహిళల ఎదుగుదలకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమా ర్క అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర మంత్రి సీతక్క, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రి న్సిపల్ సెక్రెటరీ లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్యదేవరా జన్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌తో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి, 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇంధన గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రానున్న ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని ఉద్దేశంలో ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందన్నారు. మహిళా సంఘాలు వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు. సోలార్ పవర్‌ప్లాంట్ల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భూ మిని గుర్తించాలన్నారు. ప్రతీ జిల్లాలో 150 ఎకరా లకు తగ్గకుండా భూమి సేకరించాలన్నారు. ప్రధానమంత్రి కుసుమ్ పథకంలో భాగంగా రైతులు 2 మె గావాట్ల వరకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. టీజీ రెబ్‌కో పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో మహిళా సంఘాలు, రైతుల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment