ఆసిఫాబాద్‌అర్బన్: ప్రత్యేక కార్యాచరణలో భాగంగా రైతులకు యుద్ధప్రాతిపదికన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఆ శాఖ ఆసిఫాబాద్ సర్కిల్ ఎస్‌ఈ రాథోడ్ శేషారావు ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాడి జనవరి నుంచి డిసెంబర్ వరకు 987 కనెక్షన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. 2023తో పోల్చుకుంటే దాదాపు 3.5శాతం ఇది అధికమన్నారు. రైతులు దరఖాస్తులు ఎక్కడ పెండింగ్ ఉన్నాయి.. అందుకు గల కారణాలను అగ్రికల్చర్ పోర్టల్‌లో చూసుకునే వెసులుబాటు ఉందన్నారు. అలాగే ఈ– స్టోర్స్ విధానం ద్వారా మెటీరియల్‌ను ఆన్‌లైన్ ద్వారా రిజర్వ్ చేసుకుని పనులు ప్రారంభిస్తున్నామని వివరించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Comments
Please login to add a commentAdd a comment