యువత క్రీడల్లో రాణించాలి
లింగాపూర్(ఆసిఫాబాద్): యువత క్రీడల్లో రా ణించాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండలంలోని చోర్‌పల్లిలో బుధవారం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా క్రీడాసామగ్రి, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వృద్ధులు, మహిళ ల కోసం దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపా రు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నా రు. మైనర్లు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే తల్లి దండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసె న్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు. గంజాయి పండించినా.. అమ్మినా కేసు నమోదు చేస్తామన్నారు. సీఐ రమేశ్, ఎస్సైలు గంగన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment