బాలికలు.. మైదానంలో చిరుతలు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సంకారాం గ్రామానికి చెందిన శైలజది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆసిఫాబాద్‌లోని క్రీడాపాఠశాలలో శైలజ తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇప్పటివరకు మూడుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. గతేడాది గుంటూరు, అహ్మదాబాద్, ఇటీవల రాంచీలో జరిగిన జాతీయస్థాయి జావెలిన్ త్రో పోటీల్లో పతకాలు సాధించింది. ఇటీవల నిర్వహించిన సీఎంకప్ పోటీల్లోనూ ద్వితీయ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి, కుటుంబ కష్టాలు తీరుస్తానని శైలజ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడాపాఠశాల విద్యార్థినులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. ఇక్కడ ఐదు నుంచి పదో తరగతి వరకు 210 మంది చదువుకుంటున్నారు. వీరికి కోచ్‌లు అరవింద్, విద్యాసాగర్, తిరుమల్ శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు 35 మంది జాతీయస్థాయి, వందమందికి పైగా రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించారు. అథ్లెటిక్స్‌లో 11 మంది, హ్యాండ్‌బాల్ పోటీల్లో 10 మంది, ఖోఖో పోటీల్లో ఆరుగురు జాతీయస్థాయిలో సత్తా చాటారు. ఈ పాఠశాలకు చెందిన సాక్షి అనే విద్యార్థిని జాతీయస్థాయి జావెలిన్ త్రో అండర్–14 విభాగంలో 40 మీటర్ల త్రో విసిరి దేశంలోనే తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల కోసం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతోంది. నేడు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో రాణిస్తున్న బాలికలపై ప్రత్యేక కథనం.
హ్యాండ్‌బాల్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు
– వివరాలు IIలోu
Comments
Please login to add a commentAdd a comment