అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలలోని మాలన్‌గొంది గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభకు ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న నాలుగు పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందవద్దన్నారు. అర్హులకు వర్తింపజేసేవిధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మడావి సీత, తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment