రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం స్వయం సహా యక సంఘాలకు మంజూరైన రూ.25.4 కోట్లు చెక్కును మంచిర్యాల, ఆదిలాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్లు మురళీమనోహర్ రావు, ప్రభుదాస్, డీఆర్‌డీవో దత్తారా వుతో కలిసి అందించారు. కలెక్టర్ మాట్లాడు తూ వారం రోజులుగా సెర్ప్ సిబ్బంది, వీఏఓ లు, సీసీలు, ఏపీఎంలు అహర్నిశలు శ్రమించి బ్యాంకు లింకేజీ ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పోర్తెటి శ్రీదేవికి గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడం జిల్లాకే గర్వకారణమన్నారు. ప్రతీ గ్రూపు రూ.20 లక్షల రుణం తీసుకునే స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, డీఆర్‌పీలు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో ఈ నెల 26న ని ర్వహించే గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను గురువారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఏఎస్పీలు ప్రభాకర్‌రావు, చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతి వివరాలతో స్టాల్స్, వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని, ప్రముఖులు, ప్రజలు కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment