బ్యాంకు లింకేజీ లక్ష్యం సాధించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో నిర్దేశించిన బ్యాంకు లింకేజీ లక్ష్యం పూర్తిస్థాయిలో సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం డీఆర్‌డీవో దత్తారా వు, ప్రాజెక్టు మేనేజర్ వెంకట్‌తో కలిసి ఏపీఎంలు, సీసీలతో బ్యాంకు లింకేజీ లక్ష్యాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన బ్యాంకు లింకేజీ లక్ష్యం ఈ నెల 29 వరకు వందశాతం సాధించాలన్నారు. స్వయం స హాయక సంఘాలు తీసుకున్న రుణాలు తిరిగి బ్యాంకులకు చెల్లించేలా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యం పూర్తయ్యే వరకు జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు జిల్లా కేంద్రంలోనే ఉండాలని ఆదేశించారు. అనంతరం బ్యాంకు లింకేజీ రుణాల వసూళ్లపై మండలాల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment