![ఈ–క్రాప్ నమోదు చేస్తున్న సిబ్బంది
- Sakshi](/styles/webp/s3/article_images/2023/10/19/17vic161-310137_mr_0.jpg.webp?itok=v5bF2dOP)
ఈ–క్రాప్ నమోదు చేస్తున్న సిబ్బంది
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతులు ఏ పంట సాగుచేశారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? జిల్లాలో ఏయే పంటలు సాగయ్యాయి? గత ప్రభుత్వాల్లో ఈ వివరాలు సక్రమంగా ఉండేవి కాదు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉండేవి. ఏదైనా విపత్తు సంభవిస్తే పంట నష్టం అంచనా వేసే అధికారులు ఎంత విస్తీర్ణం నమోదు చేస్తే అంతే. వాస్తవ సాగుదారుల కంటే పైరవీకారులకు పరిహారం అందేది. ఇక కౌలు రైతుల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. గత ప్రభుత్వాల్లో సాయాన్ని బట్టి ఆయా పంటల విస్తీర్ణం మారిన పరిస్థితులు గమనించాం. ఇదంతా గతం.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ లెక్కలన్నీ పక్కాగా ఉంటున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ–క్రాప్ బుకింగ్ విధానం తీసుకువచ్చారు. ఈ విధానంలో ప్రతి రైతు తను సాగు చేస్తున్న పంటలు ముందుగానే నమోదు చేసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, చీడపీడలు ఆశించి పంటలు దెబ్బతిన్న రైతుకు పరిహారం అందించేందుకు ఈ విధానంలో లెక్క పక్కాగా తేలుతోంది. పంట నష్టపోతే పరిహారం చెల్లింపుల్లో అవకతవకలు లేకుండా ఉండేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది.
నమోదు చేసుకుంటున్నారు..
పంటలకు అవసరమైన ఎరువులు, పంట అమ్మకానికి ఈ–క్రాప్ తప్పనిసరి కావడంతో రైతుల్లో చైతన్యం పెరిగింది. విధిగా ఈ–క్రాప్ నమోదు చేయించుకుంటున్నారు. ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే రైతులే తాము సాగు చేస్తున్న పంటల వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు క్షేత్ర స్థాయిలో ప్రతి సర్వే నంబర్‌ను పరిశీలించి రైతులు సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా జాబితాలు కూడా ప్రదర్శిస్తుండడంతో వాస్తవ పంటల అంచనాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ–క్రాప్ రైతులకు అండాదండగా ఉంటుంది. పంట నష్ట పరిహారం నేరుగా రైతులకు ఖాతాలో జమవుతోంది.
జిల్లాలో నూరు శాతం ఈ–క్రాప్ నమోదు
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 16 మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1,09,442 మంది రైతులు 3,12,607 ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు చేసుకున్నారు. నూరు శాతం ఈ–క్రాప్ నమోదైంది. వీరిలో 93 శాతం మంది రైతులకు ఈ–కేవైసీ ధ్రువీకరణ పూర్తయింది. గతేడాది ఖరీఫ్‌లో 1,30,635 మంది రైతులు 3,56,657 ఎకరాల్లో ఈ–క్రాప్ బుక్ చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జగ్గయ్యపేట మండలంలో పంటల సాగు తగ్గింది.
ఎన్టీఆర్ జిల్లాలో నూరు శాతం నమోదు
కొనసాగుతున్న ఈ–కేవైసీ ధ్రువీకరణ
Comments
Please login to add a commentAdd a comment