సీఎం జగన్‌తోనే బీసీల జీవితాల్లో వెలుగులు | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తోనే బీసీల జీవితాల్లో వెలుగులు

Published Thu, May 9 2024 8:25 AM

సీఎం జగన్‌తోనే బీసీల జీవితాల్లో వెలుగులు

జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్‌

కృష్ణలంక(విజయవాడతూర్పు): మన జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బీసీలు అందరూ ఆశీర్వదించి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్‌ బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు బీసీల జీవితాలను చీకటిపాలు చేశారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు న్యాయం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమాలు అందించారని గుర్తుచేశారు. నవరత్నాల పథకాలకు అద నంగా డిక్లరేషన్‌ ప్రకారం బీసీలకు ఏటా రూ.15 వేల కోట్ల చొప్పున కేటాయించి ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. బీసీ కేటగిరీల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.75 వేలు అందించారని, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వల్లే రాష్ట్రంలోని బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లు వేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement