లారీ ఢీకొని పాడిగేదెలు మృతి
జుజ్జూరు(వీరులపాడు): కంటైనర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా నాలుగు పాడి గేదెలు మృతి చెందిన ఘటన మండలంలోని జుజ్జూరు గ్రామ శివారులో గురువారం జరిగింది. ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపిన సమాచారం మేరకు.. జుజ్జూరు నుంచి రంగాపురం సమీపంలోని ప్రైవేట్ కంపెనీకి వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న ఆటోను, నాలుగు పాడి గేదెలను వేగంగా ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో జానకి నరసయ్యకు చెందిన మూడు, నాగరాజుకు చెందిన ఒక పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందాయని ఆటో డ్రైవర్, పశువుల కాపరికి గాయాలవగా ఆటో దెబ్బతిందని చెప్పారు. బాధితులను స్థానికులు హుటాహుటిన కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారని తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారని ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా పాడి గేదెలు మృతి చెందటంతో తమ జీవనాధారం కోల్పోయామని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment