కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2024
కొండలమ్మకు
రూ.20.57 లక్షల ఆదాయం
గుడ్లవల్లేరు: శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ కానుకలు లెక్కించగా 43 రోజులకు గాను రూ.20,57,257 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఆకుల కొండలరావు తెలిపారు.
అపర సంజీవనిగా తెలుగు నాట ప్రజల మన్ననలందు కున్న 108 వాహనాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాహనాలు మూలన పడుతున్నాయి. మూడు నెలలుగా జీతాలు లేక ఆరు వేల మంది సిబ్బంది కుటుంబాల్లో ఆకలి కేకలు వినపడుతున్నాయి. పేద ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.
విజయవాడ గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో మూలనపడి ఉన్న 108 అంబులెన్స్‌లు
●
9
డిమాండ్లు ఇవీ...
పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి.
2020 తర్వాత విధుల్లో చేరిన డ్రైవర్, డీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించి జీఓ నంబర్ 7 ప్రకారం వేతనాలు చెల్లించాలి.
మూడేళ్ల నుంచి నిర్లక్ష్యంగా ఉన్న ఇంక్రిమెంట్లను ఎరియర్స్ రూపంలో ఇవ్వాలి.
సీనియర్ డ్రైవర్లను వైద్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి స్లాబ్ అమలు చేయాలి.
పీఎఫ్, ఈఎస్‌ఐలకు యాజమాన్యం వాటా చెల్లించాలి.
వాహనాల ఫిట్‌నెస్‌ను వెంటనే చేయాలి.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment